పరస్పరం దాడులకు పాల్పడ్డ టీడీపీ-వైసీపీ కార్యకర్తలు.. ఒకరి మృతి

వాస్తవం ప్రతినిధి: ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం రుద్రామాంబ వరంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.రుద్రామాంబ వరంలో టీడీపీ-వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దాడుల్లో పద్మ (28) అనే టీడీపీ మహిళా కార్యకర్త సంఘటన స్థలంలోనే మృతి చెందింది.రెండు రోజుల క్రితమే చీరాల నియోజవర్గంలో పోలీస్ అధికారుల బదిలీలు జరిగాయి. టీడీపీ ప్రభుత్వం నియమించిన అధికారుల స్థానంలో కొత్త అధికారులను సీఐ,ఎస్ఐలుగా నియమించడం జరిగింది. దీంతో వైసీపీ శ్రేణులు టీడీపీ నేతల ఇళ్లపై దాడి చేస్తున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారన్న విమర్శలు టీడీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. దాడులపై చినగంజాం స్టేషన్‌కు ఫోన్ చేసినా పోలీసులు స్పదించలేదని ఎవరూ తమను రక్షించలేదని టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. దాడిలో గాయపడ్డ పద్మను ఆస్పత్రికి తరలిద్దామన్నా.. వైసీపీ నేతలు మళ్లీ ఎక్కడ దాడులకు దిగుతారోనన్న భయంతో ఆస్పత్రికి తీసుకెళ్లలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు.