బిజెపి ఆఫర్ ను వద్దు అని తేల్చి చెప్పిన జగన్..!

వాస్తవం ప్రతినిధి: దేశంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో లోక్ సభ సాధించిన స్థానాలలో దేశంలోనే పార్లమెంటులో నాలుగో అతి పెద్ద పార్టీగా అవతరించింది వైసీపీ పార్టీ. 22 మంది ఎంపీలతో పార్లమెంటులో నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించిన వైసీపీకి కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భాజాపా డిప్యూటీ స్పీకర్ పదవిని జగన్ పార్టీ కి ఆఫర్ చేసింది. దీంతో వైయస్ జగన్ బిజెపి ఇచ్చిన ఆఫర్ ను వద్దు అని తేల్చి చెప్పటం జరిగింది. ప్రత్యేక హోదా నే తమ మొదటి ప్రాధాన్యత అని, డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టడం వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదని..ఒకవేళ ఆ పదవి స్వీకరించిన ఎన్డీఎకు దగ్గరైనట్లు సంకేతాలు వెళ్తాయని, దానివల్ల తనకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాము వైసిపి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తామని స్పష్టంగా చెప్పలేదని, సంకేతాలు మాత్రమే ఇచ్చామని, వైసిపి ఆసక్తి ఉంటే ఆ పదవి ఇస్తామనే సంకేతాలను పంపించామని బిజెపి నాయకులు అంటున్నారు, ప్రత్యేక హోదా మాత్రమే తమ ప్రథమ ప్రాధాన్యమని, అది లేకుండా ఎన్డీఎ ప్రభుత్వం ఇచ్చే పదవులను తీసుకోవడానికి సిద్దంగా లేమని వైసిపి నాయకులు అంటున్నారు.