చంద్రబాబుని అనుసరిస్తున్న ఆ రాష్ట్ర సీఎం..!

వాస్తవం ప్రతినిధి: విభజనతో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రంలో మొట్ట మొదటి సారి జరిగిన ఎన్నికలలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ఇరికించారని ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వైసిపి పార్టీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. కేవలం నలుగురు మంత్రులు ఒక్కసారి తాగిన డ్రై ఫ్రూట్ జ్యూస్ కోసం లక్షలు ఖర్చు పెట్టిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనని వైసీపీ నేతలు ఇటీవల పేర్కొన్నారు. అదేవిధంగా ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా చంద్రబాబు ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. కుమార్ స్వామి ఒక గ్రామంలో నిద్ర చేయడానికి అయిన ఖర్చు అక్షరాల కోటి రూపాయలు అని లెక్క తేల్చారు. ఎపిలో చంద్రబాబు ఏ కర్యక్రమం నిర్వహించినా కోట్లు వ్యయం చేసిన సంగతి తెలిసిందే.అదే బాటలో కుమారస్వామి కార్యక్రమాలకు వ్యయం చేశారని కథనం వచ్చింది.

ఆయన యాద్గిర్ జిల్లాలోని చందార్కి గ్రామంలో ఉండి అక్కడే రాత్రి నిద్ర చేసి ప్రజలతో గడపాలని కార్యక్రమం పెట్టుకున్నారు. ఆయన ఆర్టిసి బస్ లోనే వచ్చారు. ప్రభుత్వ స్కూల్ లో ఉన్నారు. పరుపు కూడా లేకుండా పడుకున్నారా. అయినా బిల్లు మాత్రం కోటి రూపాయలు అవడం విశేషం.జనాల తరలింపు,వచ్చిన వారికి భోజనం,టిఫిన్ తదితర సదుపాయాల కోసం ఏభై లక్షల రూపాయలు అయితే, వేదిక తదితర ఏర్పాట్లకు మరో ఏభై లక్షల ఖర్చు అయినట్లు సమాచారం.