ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ అటువంటి క్యారెక్టర్స్ చేయవచ్చు అంటున్న నాగబాబు..!

వాస్తవం సినిమా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఓడిపోవడం పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగబాబు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని..ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో చంద్రబాబు పై వ్యతిరేకత మరియు జగన్ పై సానుభూతి బాగా పని చేశాయని..ప్రజలంతా జగన్ కి ఒకసారి అవకాశం ఇద్దాం అన్న ఆలోచన లోనే ఉన్నారని..దీంతో పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టారని పేర్కొనడం జరిగింది. అయితే ఓడిపోయినా గాని 2024 ఎన్నికలలో కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ జెండా ఎగరటం ఖాయమని నాగబాబు పేర్కొన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఒక్కసారి రాజకీయాల్లోకి వెళ్ళాక సినిమాలు చెయ్యను అని స్టేట్మెంట్ ఇచ్చాక ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం కష్టమని కళ్యాణ్ ఒకసారి మాటిస్తే మాటే అని…ఒకవేళ కళ్యాణ్ సినిమాలు చేయాల్సి వస్తే భవిష్యత్తులో గెస్ట్ రోల్ లో చేసే అవకాశాలు ఉండవచ్చని నాగబాబు పేర్కొన్నారు.