పాలకమండలి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే పోరాటం చేస్తాం: శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామీజీ

వాస్తవం ప్రతినిధి: పాలకమండలి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే పోరాటం చేస్తామని శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామీజీ అన్నారు. తిరుమలలో ఈరోజు ఆయన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శివస్వామీజీ మాట్లాడుతూ టీటీడీలో ఇతర మతస్థుల ఉద్యోగులను తొలగించాలన్నారు. జగన్‌ ప్రజామోదం కలిగేలా పాలన చేస్తే మోడీలా విజయం సాధిస్తారన్నారు. జగన్‌ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తే చంద్రబాబులా ఓటమి పాలవుతారన్నారు. ఆభరణాలపై వచ్చిన ఆరోపణలపై విచారణకు కమిటీని నియమించాలన్నారు.