ఇండోనేషియా లో భారీ భూకంపం

వాస్తవం ప్రతినిధి: ఇండోనేషియాను భారీ భూకంపం కుదిపేసింది. యాంబన్‌ దక్షిణాన 321 కిలోమీటర్ల దూరంలో బండా సముద్ర తీరం వద్ద సముద్ర ఉపరితలానికి 214 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. యందేనా ఐలాండ్‌లోని సోంలకీ సముద్రతీరంపై తీవ్ర ప్రభావం చూపిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.5 శాతంగా నమోదైంది.