గ్రామ వలంటీర్ల ఎంపిక కోసం నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

వాస్తవం ప్రతినిధి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ వలంటీర్ల ఎంపిక కోసం నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. నేటి నుంచి జులై 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా.. వచ్చే నెల 10 తేదీలోగా స్క్రూట్నీ పూర్తి చేసి… 11వ తేదీ నుంచి 25 తేదీలోపు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇక, ఎంపికైన వాలంటీర్లకు ఆగస్టు 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శిక్షణ ఇస్తారు. ఆగస్టు 15 నుంచి గ్రామ వాలంటీర్లకు పోస్టింగ్ ఇవ్వనున్నారు. కాగా, ప్రతీ 50 ఇళ్లకు ఓ గ్రామ వాలంటీరును నియమించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే… నవ రత్నాల అమలు బాధ్యతను గ్రామ వాలంటీర్లకు అప్పజెప్పాలని భావిస్తోంది ప్రభుత్వం. ఈ గ్రామ వాలంటీరుగా పోస్టింగ్ పొందినవారికి నెలకు రూ.5వేల వేతనం ఇవ్వనుంది ప్రభుత్వం.