మహేష్ బాబు తో సినిమా పై సందీప్ వంగ షాకింగ్ కామెంట్స్!

వాస్తవం సినిమా: ‘అర్జున్ రెడ్డి’ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ సినిమా డైరెక్టర్ సందీప్ వంగ ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అంతలా ఆ సినిమా అప్పట్లో ఇండస్ట్రీలో బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్లు సృష్టించి కొత్త ట్రెండ్ సెట్ చేసింది. అప్పట్లో ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసిన చాలామంది ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు డైరెక్టర్ సందీప్ వంగా తో కలిసి పనిచేయాలని ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసిన వెంటనే స్టోరీ సిద్ధం చేయమని వెంటనే డైరెక్టర్ సందీప్ వంగ కు చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇటువంటి క్రమంలో తాజాగా అర్జున్ రెడ్డి సినిమా హిందీలో కబీర్ సింగ్ గా సందీప్ వంగ డైరెక్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇటీవల విడుదలైన క్రమంలో ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సందీప్ వంగా.. మహేష్ బాబు తో సినిమా అనే విషయంపై షాకింగ్ కామెంట్ చేశారు. తాను మహేష్ బాబు కి ఆల్రెడీ ఒక స్టోరీ రెడీ చేసి వినిపించడం జరిగిందని కానీ మహేష్ బాబు కి నచ్చలేదని వేరే స్టోరీని సిద్ధం చేయమని చెప్పారని పేర్కొన్నారు డైరెక్టర్ సందీప్ వంగ. ప్రస్తుతం సందీప్ క్రైమ్ నేపథ్యంలో సాగే ఓ కథని సిద్ధం చేస్తున్నాడట. ఈ చిత్రం హీరోగా ఎవరు నటిస్తారనేది త్వరలో తెలియనుంది.