నేడు పార్టీ నేతలతో భేటీ కానున్న పవన్ కళ్యాణ్

వాస్తవం ప్రతినిధి: జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇవాళ సాయంత్రం 5 గంటలకు అమరావతికి రానున్నారు. పార్టీ నాయకులతో పవన్‌ కల్యాణ్‌ విడివిడిగా సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పవన్‌ పార్టీ నేతలతో చర్చించనున్నారు. అలాగే పార్టీలో నుంచి వెళుతున్న నేతల గురించి కోర్‌ కమిటీలో పవన్‌ చర్చించనున్నారు.