భారత్‌ లో పర్యటించనున్న అమెరికా రక్షణ మంత్రి మైకేల్‌ పాంపియో

వాస్తవం ప్రతినిధి: అమెరికా రక్షణ మంత్రి మైకేల్‌ పాంపియో ఈ నెల 25వ తేదీనుంచి మూడు రోజులపాటు భారత్‌ పర్యటనకు వస్తున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై పాంపియో భారత నేతలతో చర్చిస్తారు. జపాన్‌లోని ఒసాకాలో ఈ నెల 28నుంచి రెండు రోజులపాటు జరిగే జి20 దేశాల సదస్సులో ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ల భేటీకి ముందుగా పాంపియో భారత్‌ సందర్శించడం గమనార్హం.