మొట్టమొదటిసారి విజయసాయి రెడ్డి, జగన్ లను పొగిడిన టిడిపి..!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్ర రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ నేతలు ఎప్పుడూ జగన్ ని, విజయసాయిరెడ్డిని టార్గెట్ గా చేసుకుని వీడియో సమావేశం దొరికినప్పుడల్లా చడామడా విమర్శలు చేస్తుంటారు. చాలా సందర్భాలలో జగన్, విజయసాయిరెడ్డి లను కలిపి టీడీపీకి చెందిన నేతలు బండ బూతులు తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా మొట్టమొదటిసారి విజయసాయి రెడ్డి, జగన్ లను కలిపి పొగిడారు టీడీపీకి చెందిన నేతలు.

ప్రస్తుతం ఏపీ టీడీపీ లో ఉన్న నేతలు బీజేపీ పార్టీ లోకి వెళ్లి పోతున్న క్రమంలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన కామెంట్ చేశారు. అదేమిటంటే గతంలో వైసీపీ పార్టీ నుంచి ఇరవైమూడు మంది ఎమ్మెల్యేలను టిడిపిలోకి తీసుకోవడం తప్పేనని ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అయితే ప్రస్తుతం సుజనా చౌదరి, సి.ఎమ్.రమేష్ వంటివారు చేసింది దారుణమైన నమ్మక ద్రోహమని ఆయన అన్నారు. వారు కేసుల గురించి బ్యాంకు రుణాల ఎగవేత వంటి సమస్యల నుంచి బయటపడడానికి వెళుతున్నారా అని ఆయన అన్నారు.

వారికి ప్రజాదరణ లేదని, వారు ఎన్నడూ ప్రజలలో గెలవలేదని అన్నారు. గెలిచినా, ఓడినా నమ్మకం గా ఉండాలని అంటూ జగన్ ,విజయసాయిరెడ్డిలు జైలులో ఉండాల్సి వచ్చినా,వారు విడిపోలేదని , కలిసి ఉన్నారు కాబట్టే ఆదరణ పొందగలిగారని ఆయన అన్నారు.వారిని తాము ప్రశంసించడం లేదని,అయినా జరిగిన విషయం చెబుతున్నానని ఆయన చెప్పారు.