బిజెపి లో చేరిన తరువాత ఏపీ స్పెషల్ స్టేటస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సుజనా చౌదరి..!

వాస్తవం ప్రతినిధి: ఇటీవల ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి బిజెపి పార్టీలో చేరడం జరిగింది. ఇలా బిజెపి పార్టీ కండువా కప్పుకున్నారో లేదో మీడియా సమావేశం పెట్టి ఏపీ స్పెషల్ స్టేటస్ పై షాకింగ్ కామెంట్ చేశారు సుజనా చౌదరి. మీడియాతో మాట్లాడిన సుజనా చౌదరి తనకి రాజకీయ గురువు చంద్రబాబు అని, ఆయనను ఎప్పుడూ తాను గౌరవిస్తాను అంటూ తెలుగుదేశం పార్టీని వీడటం బాధగానే ఉందని పేర్కొన్నారు. మరియు అదే విధంగా తెలుగుదేశం పార్టీ తిరిగి పునర్వైభవం చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు తాను టీడీపీనీ వీడి బీజేపీలో చేరింది కేసులకు భయపడి కాదు అసలు నాపైన కేసులే లేవు కేవలం అభియోగాలు మాత్రమే ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. ఏపీకి ప్రత్యేక హొదా ఇక ముగిసిన అధ్యాయమే అంటూ మాట్లాడారు. రాష్ట్రానికి, దేశానికి తనవంతు సాయంగా సేవ చేయాలనే సంకల్పంతోనే బీజేపీలో చేరానని, ప్రస్తుతం దేశంలో మోదీ పాలన బాగుందంటూ ప్రశంసించారు. దేశానికి మోదీలాంటి నాయకుడు ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వంగా ఉందని చెప్పాడు.