ఓం బిర్లా కు ప్రధాని మోదీ అభినందనలు

వాస్తవం ప్రతినిధి: 17వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాని మోదీ ఆయనను సభాపతి స్థానానికి తీసుకు వచ్చి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. ఆయనకు అధికార, విపక్ష సభ్యులు అభినందనలు తెలిపారు. ఓం బిర్లా ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో.. ఓం బిర్లా పేరును అధికారికంగా ప్రొటెం స్పీకర్ ప్రకటించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. గొప్ప స్పీకర్‌గా ఓం బిర్లా నిలిచిపోతారని అన్నారు. విద్యార్థి దశ నుంచే ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారని తెలిపారు. రాజస్థాన్‌లో కొట అనే చిన్న పట్టణం.. నేడు మంచి గుర్తింపు సాధించిందంటే దానికి ఆయనే కారణమన్నారు. కాగా.. గుజరాత్‌లో భూకంపం సంభవించినప్పుడు అక్కడే నెలల తరబడి ఉండి బిర్లా పరిస్థితి సమీక్షించారని పేర్కొన్నారు.