ట్రాన్స్‌పోర్టు వాహనాల డ్రైవింగ్‌ లైసెన్స్‌ కు కావలసిన అర్హతపై సవరణ

వాస్తవం ప్రతినిధి: ట్రాన్స్‌పోర్టు వాహనాలను నడిపించడానికి జారీ చేసే డ్రైవింగ్‌ లైసెన్సులకు ఇప్పటి వరకూ ఉన్న కనీస విద్యార్హతను తొలగించాలని కేంద్ర రోడ్లు, రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 1989నాటి సెంట్రల్‌ మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌లోని రూల్‌ 8కి సవరణ చేయడానికి అవసరమైన ప్రక్రియ ప్రారంభించింది. ప్రస్తుతమున్న నిబంధల ప్రకారం ట్రాన్స్‌పోర్టు వాహనాలను నడిపే డ్రైవర్లు కనీసం 8వ తరగతి పాసై ఉండాలి.