చంద్రబాబు ని ఫాలో అవుతున్న దీదీ..!

వాస్తవం ప్రతినిధి: 2019 సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ. దీంతో ఫలితాలు వచ్చిన తర్వాత ఆ పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు ఈవీఎంలపై అనవసరమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే పాటని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎత్తుకున్నారు. రెండు సార్లు ఈవిఎమ్ ల ద్వారానే గెలిచిన మమత ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగించిన 30 శాతం ఈవీఎంలలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసిన ఆమె.. ఎన్నికల సమయంలో ఈవీఎంలు      మొరాయించినప్పుడు వాటి స్థానంలో అధికారులు కొత్తవాటిని ఏర్పాటు చేశారన్నారు. అయితే కొత్త ఈవీఎంలను మార్చేటప్పుడు వాటిల్లో మాక్ పోలింగ్ నిర్వహించకపోవడం అనుమానాలకు తావిస్తోందని మమత అన్నారు.