గోడ దూకడానికి రెడీగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు..!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి దారుణంగా ప్రజలు బుద్ధి చెప్పడంతో..చరిత్రలో ఆ పార్టీ కనీవినీ ఎరుగని ఓటమిని 2019 ఎన్నికల్లో నమోదు చేసుకుంది. కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మరియు ముగ్గురు ఎంపీలతో చాలా దారుణమైన స్థితిలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఉంది. ఇటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారని వార్తలు తెగ గుప్పుమంటున్నాయి. అంతే కాకుండా ఇటీవల జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ టిడిపి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారని నేరుగా టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు కి చెప్పడం కూడా జరిగింది. నేను డోర్లు తెరిస్తే మీకు ప్రతిపక్షం కూడా మిగలదు అని జగన్ చంద్రబాబు పై అసెంబ్లీ లో డైలాగులు కూడా వేశారు. ఇటువంటి క్రమంలో తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే తెలుగుదేశం పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ గోడ దూకడానికి మారటానికి రెడీగా ఉన్నట్లు చంద్ర‌బాబుకే అనుమానం ఉందని సమాచారం. ఎన్నికల్లో ఓటమి పై సమీక్ష వేసిన చంద్రబాబు కి ఈ విషయం అర్థమైందని సమాచారం. అయితే కొందరు వైసీపీలోకి, మరికొందరు బీజేపీలోకి వెళ్లాలని పాలు పంచుకున్నారంట. విశాఖ నగరం నుంచి గెలిచిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో సహా నలుగురు ఎమ్మెల్యేలు ఎప్పుడైనా మారొచ్చని సమాచారం. ఇప్పటికే జగన్ తో సన్నిహితంగా ఉంటున్నటు వంటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారడం ఖాయమని అందరూ అంటున్నారు.