చంద్రబాబును వ్యక్తిగతంగా అవమానించేందుకు కుట్రలు చేస్తున్నారు: బుద్దా వెంకన్న

వాస్తవం ప్రతినిధి: చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…. చంద్రబాబును వ్యక్తిగతంగా అవమానించేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. వైసీపీ నేతలు కేంద్రం పెద్దలతో చెప్పించి ఎయిర్ పోర్టులో చంద్రబాబును తనిఖీ చేసి అవమానించారన్నారు. చంద్రబాబు జడ్ ప్లస్ కేటగిరిలోనే ఉన్న విషయం అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు. జగన్, విజయసాయిరెడ్డిలు అధికారులను తిట్టినా మేం ఒక్క కేసు పెట్టలేదన్నారు. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనే సంప్రదాయాన్ని పాటిస్తున్నామన్నారు.