జగన్ మైండ్ గేమ్ తో బాబు కి టెన్షన్..?

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికలలో చాలా దారుణంగా టిడిపి ఓడిపోవడంతో పార్లమెంటు స్థానాల విషయంలో కూడా ఆశించిన స్థాయిలో తెలుగుదేశం పార్టీ రాణించకపోవడంతో జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబుని పట్టించుకునే నాధుడే లేకుండా పోయారు. ముఖ్యంగా ఎన్నికల ముందు రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని తెగ డబ్బాలు కొట్టుకున్న చంద్రబాబు.. జాతీయస్థాయిలో మోడీ మరొకసారి ప్రధాని కాకుండా తెగ ప్రయత్నాలు జరిపి ఇప్పుడు కేంద్రం మరియు రాష్ట్రంలో ఉన్న అధికార నేతల దృష్టిలో విలన్ గా చంద్రబాబు కనబడుతున్నారు.మరోపక్క తనకంటే వయసులో తక్కువ అయినా జగన్ నీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో సంబోధించడానికి చంద్రబాబు తెగ ఇబ్బంది పడుతున్నారని టీడీపీ పార్టీలో వినబడుతున్న టాక్. అంతేకాకుండా జరిగిన అసెంబ్లీ సమావేశాలలో రెండో రోజు జగన్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుని తలెత్తుకోలేక పోయేలా చేశాయని ..తాను తలుచుకుంటే టీడీపీలో ఎవరూ ఉండరని జగన్ చేసిన కామెంట్లు టీడీపీ అధినేత చంద్రబాబు కి తలదించుకునే పరిస్థితి కు వచ్చాయనే వార్తలు ఆంధ్ర రాజకీయాలలో వినబడుతున్నాయి. ఒక పక్క రాష్ట్రంలో జగన్ మైండ్ గేమ్ తో, మరో పక్క కేంద్రంలో మోడీ దృష్టిలో చంద్రబాబు ఒక విలన్ గా ఉండటంతో ఇది చాలా దయనీయమైన పరిస్థితి అని చంద్రబాబు పొలిటికల్ కెరియర్ లోనే ఇదొక డార్క్ పిరియడ్ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.