శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం

వాస్తవం ప్రతినిధి: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. దీంతో కంపార్ట్ మెంట్ ల వెలుపల కూడా భారీగా క్యూ ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. నడకదారి భక్తులకు, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యంకలగడానికి మూడు గంటలకు పైగా సమయం పడుతోంది.