శ్రీవారిని దర్శించుకున్న పీయూష్ గోయల్

వాస్తవం ప్రతినిధి: రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఈ తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి అభిషేకంలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి టీటీడీ జీఈవో స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనానంతరం మంత్రికి రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికారు. అనంతరం శేషవస్త్రంతో సత్కరించారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు.