నా మనసుకు నచ్చిన కార్యక్రమం ఇదే: ఏపీ సీఎం జగన్

వాస్తవం ప్రతినిధి:ప్రైవేటు స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రతి స్కూల్‌ను ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడతామని… తెలుగు కూడా తప్పనిసరి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని చదువుకునే పిల్లలందరికీ మేనమామనవుతానని సీఎం అన్నారు. రాజన్న బడి సందర్భంగా తాడేపల్లి మండలం పెనుమాక జడ్పీ పాఠశాలలో చిన్నారులతో అక్షరభ్యాసం చేయించిన జగన్… రాష్ట్రంలోని పిల్లలందరినీ చదవించే బాధ్యత తమ ప్రభుత్వానిదే అని హామీ ఇచ్చారు. నేడు మనసుకు నచ్చిన కార్యక్రమంలో పాల్గొన్నానన్న జగన్… పాదయాత్ర సందర్భంగా పిల్లల చదువును నేను చూసుకుంటానని అందరికీ మాట ఇచ్చామని అన్నారు. పిల్లలను బడికి పంపించే ప్రతి మహిళకు జనవరి 26 నాటికి రూ. 15 వేలు ఇస్తామని తెలిపారు.