ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీ ఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో వైఎస్ జగన్ భేటీకానున్నారు. అలాగే రేపు ఢిల్లీలో జరిగే నీతి అయోగ్ సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హజరవుతారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలతో చర్చిస్తారు. ఏపీ సమస్యలపై ఎలా వ్యవహారించాలో వైసీపీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.