అమిత్‌షా అధ్యక్షతన సమావేశమైన పార్టీ సీనియర్ నేతలు

వాస్తవం ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి నూతన అధ్యక్షుడిని ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభమైంది. బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా అధ్యక్షతన నేడు ఆ పార్టీ సీనియర్‌ నేతల సమావేశం ఇక్కడ ప్రారంభమైంది. ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. నూతన అధ్యక్షుడి ఎంపిక విషయంలో పార్టీ సంస్థాగత ప్రక్రియ పూర్తి కావడానికి మూడునుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశాలున్నాయి.