రేపు ఢిల్లీకి వెళ్లనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీకి చేరుకున్న అనంతరం ఈ నెల 15న ఉదయం 10 గంటలకు నంబర్‌1, జన్‌పథ్‌లో వైసీపీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ భేటీ అనంతరం కొందరు కేంద్ర మంత్రులను జగన్ కలుసుకునే అవకాశముందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.