దుర్గగుడి ఫ్లైఓవర్‌ నిర్మాణం డిసెంబర్‌ కల్లా పూర్తి చేస్తాం: మంత్రి ధర్మాన కృష్ణదాస్‌

వాస్తవం ప్రతినిధి: దుర్గగుడి ఫ్లైఓవర్‌ నిర్మాణం డిసెంబర్‌ కల్లా పూర్తి చేస్తామని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. సచివాలయంలో ఈరోజు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయనమాట్లాడుతూ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ పాలన చేస్తున్నామన్నారు. అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. మరో రెండేళ్లలో అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే పూర్తవుతుందన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి సమర్థంగా పని చేస్తామన్నారు.