ద్వివేదీ బదిలీ..ఆయన స్థానంలో విజయానంద్‌ నియామకం

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఏపీ క్యాడర్‌కు చెందిన విజయానంద్‌ను నియమిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం కావేటి విజయానంద్‌ ఏపీ జెన్‌కో సీఎండీగా వ్యవహరిస్తున్నారు. 1992లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు సబ్‌ కలెక్టర్‌గా విజయానంద్‌ తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.