తమ్మినేని సీతారామ్ కు అభినందనలు తెలిపేందుకు వస్తూ అనంతలోకాలకు చేరిన అభిమానులు

వాస్తవం ప్రతినిధి: ఏపీ స్పీకర్ గా పదవీబాధ్యతలు చేపట్టనున్న తమ్మినేని సీతారామ్ కు అభినందనలు తెలిపేందుకు ఆయన్ను అభిమానించే నేతలు.. కార్యకర్తలు పెద్ద శ్రీకాకుళం జిల్లా నుంచి రెండు బస్సులు.. ఆరు కార్లలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు బయలుదేరారు. తూర్పుగోదావరి జిల్లాలోని తుని వద్ద వీరు ప్రమాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ తెల్లవారుమజాన వారు తుని పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం ధర్మపురానికి చెందిన 69 ఏళ్ల పప్పల నారాయణమూర్తి.. గోరింట గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ బీఎల్ నాయుడు (55) అక్కడికక్కడే మరణించారు. వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని తుని ఆసుపత్రికి తరలించి వైద్యసాయాన్ని అందిస్తున్నారు. అభినందనలు తెలిపేందుకు వస్తున్న వారు దుర్మరణం పాలుకావటం వైఎస్సార్ కాంగ్రెస్ నేతల్లో విషాదం నెలకొంది.