చిత్తూరు జిల్లాలో రోడ్డుప్రమాదం ఇద్దరు మృతి

వాస్తవం ప్రతినిధి: రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో 8మందికి తీవ్రగాయాలైన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పలమనేరు శివారులో వ్యాను, ఆటో ఢీకొని ఇద్దరు మృతిచెందగా, మరో 8మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.