శాసనసభ సమావేశాల సందర్భంగా అసెంబ్లిలో ఛాంబర్ల కేటాయింపుపై వివాదం

వాస్తవం ప్రతినిధి: శాసనసభ సమావేశాల సందర్భంగా అసెంబ్లిలో ఛాంబర్ల కేటాయింపుపై వివాదం నెలకొంది. గతంలో అసెంబ్లిలో ప్రవేశ ద్వారానికి ఎడమవైపు వైఎస్‌ఆర్‌ ఎల్పీతో పాటు విపక్ష నేతకు వేరు వెెరుగా ఛాంబర్లు కేటాయించారు. కాగా ముఖ్యమంత్రి కార్యాలయం కి దగ్గరలో టీడీఎల్పీ కార్యాలయంతో పాటు మరో ఛాంబర్‌ను కేటాయించారు. అయితే ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ ఎల్పీ కార్యాలయం, విపక్ష నేతగా ఉన్న ప్పుడు జగన్‌కు కేటాయించిన ఛాంబర్‌ను ప్రస్తుతం విప క్షంగా ఉన్న చంద్రబాబుకు కేటాయించాల్సి ఉంది. అయితే వైఎస్‌ఆర్‌ ఎల్పీ, విపక్ష నేత ఛాంబర్లను తెదేపాకు అప్పచేప్పేందుకు సుముఖంగా లేదు. దీంతో గతంలో లోకేష్‌ ఛాంబర్‌తో పాటు ఉపసభాపతి ఛాంబర్లను తెదేపాకు కేటాయించారు. అయితే మంళగవారం సాయంత్రం వరకు ఆయా ఛాంబర్ల ఎదుట నేమ్‌ ప్లేట్‌ను పెట్టలేదు. గతంలో మాదిరిగానే వైకాపా, తెదేపా ఛాంబర్లు మంగళవారం సాయంత్రం వర కు కొనసాగుతున్నాయి. కాగా బుధవారం శాసనసభ్యులు ప్రమాణస్వీకారం అనంతరం అసెంబ్లి కార్యదర్శి అధి కార, ప్రతిపక్ష ఎల్పీ కార్యాలయాలకు ఛాంబర్లు కేటాయించనున్నట్లు సమాచారం. మొత్తం మీద శాసనసభ సమా వేశాల సందర్భంగా ఛాంబర్ల కేటాయింపుపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం నెలకొంది. అదేవిధంగా ఈసారి ఐదుగురు ఉపముఖ్యమంత్రులు ఉండటంతో వారి హోదాకు తగ్గట్లు ఛాంబర్లను కేటాయించడం కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. ఇదిలా ఉండగా అసెంబ్లిలో సైతం సీ ట్ల మార్పులు చేర్పులు చేశారు.