ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వాస్తవం ప్రతినిధి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త ప్రభుత్వం హయాంలో తొలి అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 11.05 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు జరగనున్నాయి. ప్రొటెం స్పీకర్‌ అప్పలనాయుడు ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నారు. రేపు స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను సభ అధికారికంగా ఎన్నుకోనుంది. ఈ నెల 14న గవర్నర్‌ నరసింహన్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో శాసనసభకు సెలవు. ఈ నెల 17, 18 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి.