నేడు పాకిస్ధాన్- ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్

వాస్తవం ప్రతినిధి: వరల్డ్ కప్ లో భాగంగా నేడు పాకిస్ధాన్- ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.టాంటన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమౌతుంది. వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఇప్పటి వరకూ ఆడిన మూడు మ్యాచ్ లలో రెండింటిలో విజయం సాధించి ఒక మ్యాచ్ లో పరాజయం పాలైంది. అలాగే పాకిస్థాన్ ఇప్పటి వరకూ ఆడిన మూడు మ్యాచ్ లలో ఒక దాంటో విజయం సాధించి మరో దాంట్లో పరాజయం పాలైంది.