వివాదాస్పదమైన జాజ్‌ టీవీ చానల్‌ ప్రకటన

వాస్తవం ప్రతినిధి: భారత్‌తో పాక్‌ మ్యాచ్‌ నేపథ్యంలో జాజ్‌ టీవీ చానల్‌ ప్రకటన వివాదాస్పదమైంది . భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పోలిన క్యారెక్టర్‌తో పేరడీ ప్రకటనను రూపొందించింది. ఈ ప్రకటనలో, అభినందన్‌ క్యారెక్టర్‌ను భారత క్రికెటర్‌గా. చూపించారు. టీమిండియా జెర్సీ, రొయ్యమీసంతో ఉన్న వ్యక్తితో అభినందన్‌ వైరల్‌ స్టేట్‌మెంట్‌ను పేరడీగా చెప్పించారు. టీమిండియా తుది జట్టు వ్యూహాలు, టాస్‌ గెలిస్తే బ్యాటింగ్‌ తీసుకుంటారా? లేక బౌలింగ్‌ ఎంచుకుంటారా? వంటి పలుప్రశ్నలను అడగడం.. ఇందుకు ఐ యామ్‌ సారీ.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేను.. అంటూ సదరు డూప్లికేట్‌ అభినందన్‌ పదేపదే జవాబివ్వడం ఈ ప్రకటనలో హైలెట్‌. ఇక్కడ కూడా అభినందన్‌ కేరక్టర్‌ తన చేతిలోని కాఫీ కప్‌ను సిప్‌చేస్తున్నట్లు చిత్రీకరించారు. ఆఖరిగా, ఒక్క సెకన్‌ ఆగండి.. కప్‌ను (ఐసీసీ ట్రోఫీ) ఎక్కడకు తీసుకెళ్తున్నావ్‌? అని విచారణాధికారి ప్రశ్నించడం వీక్షకులను ఆకట్టుకుంది.