ఏపీఎస్ ఆర్టీసీ సమ్మె ప్రతిపాదన విరమణ

వాస్తవం ప్రతినిధి: ఏపీఎస్ ఆర్టీసీ సమ్మె ప్రతిపాదన విరమించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చించారు. జేఏసీ నేతల డిమాండ్లపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. రేపటి నుంచి తలపెట్టిన ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది.