జైపూర్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన స్పైస్‌ జెట్‌ విమానం

వాస్తవం ప్రతినిధి: స్పైస్‌ జెట్‌ విమానం జైపూర్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. విమానం టైర్‌ పేలిపోవడంతో పైలెట్లు విమానాన్ని అత్యవసరంగా జైపూర్‌లో ల్యాండ్‌ చేశారు. విమానంలో మొత్తం 189 మంది ప్రయాణీకులున్నారు. దుబాయ్‌ – జైపూర్‌ ఎస్‌జి 58 విమానం నేటి ఉదయం 9 గంటల ప్రాంతంలో అత్యవసరంగా జైపూర్‌లో ల్యాండ్‌ అయిందని అధికారులు చెప్పారు.