వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సం రక్షణ బాధ్యతను సక్రమంగా నిర్వహించకపోతే జైలుశిక్షే!

వాస్తవం ప్రతినిధి: బీహార్‌లో ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను సక్రమంగా నిర్వహించని కుమారులు, కుమార్తెలకు జైలుశిక్ష విధించాలనే నిర్ణయానికి మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. బీహార్‌ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తల్లిదండ్రులను పట్టించుకోని వారికి జైలు శిక్ష విధించాలంటూ ప్రతిపాదించారు. ఈ కేసులను నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్‌ కింద నమోదు చేయనున్నారు.