ఆంధ్రప్రదేశ్ సమాచారశాఖ కమిషనర్ గా విజయకుమార్ రెడ్డి

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ గా తుమ్మా విజయకుమార్ రెడ్డిని నియమించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్) 1990 బ్యాచ్ కు చెందిన విజయ కుమార్ రెడ్డి డిప్యుటేషన్ పై రెండు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సేవలందించడానికి కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ అనుమతించింది. దాంతో ఆయన ఈ నెల 10వ తేదీన సాధారణ పరిపాలనా విభాగంలో రిపోర్ట్ చేయడంతో మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఎస్.వెంకటేశ్వర్ స్థానంలో సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ గా, ప్రభుత్వ ఎక్స్ అఫిషియో కార్యదర్శిగా విజయకుమార్ రెడ్డి బాధ్యతలు నిర్వహించనున్నారు.