నేడు ముఖ్యమంత్రి గా అసెంబ్లిలో అడుగు పెట్టనున్న జగన్

వాస్తవం ప్రతినిధి: గత అసెంబ్లిలో విపక్ష నేతగా ఉన్న జగన్‌ నేడు ముఖ్యమంత్రి అసెంబ్లిలో అడుగు పెట్టడం విశేషం.. అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నేడు ప్రతిపక్ష నేతగా అసెంబ్లికి హాజరు కావడం విశేషం. ఇదిలా ఉండగా రెండు సంవత్సరాల క్రితం విపక్ష నేతగా ఉన్న జగన్‌ అసెం బ్లి సమావేశాలను బహిష్కరించడంతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా శాసనసభకు హాజరు కాలేదు. రెండు సం వత్సరాల అనంతరం పార్టీ విజయం సాధించిన తరువాత స శానసభలో అడుగుపెట్టడం గమనార్హం. కాగా 2017 నంవబర్‌ నాటి నుంచి గత మార్చి వరకు జరిగిన అసెంబ్లి సమావేశాల్లో ప్రతిపక్షం లేకుండానే జరగడం దేశ చరిత్రలోనే రికార్డు. అప్పటి వరకు మిత్ర పక్షంగా వ్యవహరించిన భాజపా శాసనసభలో కొంత కాలం ప్రతిపక్ష పాత్ర పోషించింది.