కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు.. ముఖ్య అతిధిగా జగన్

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక భావించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు ఈ నెల 21న ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ ‌రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించారు. త్వరలోనే విజయవాడకు స్వయంగా వెళ్లి జగన్‌ను కేసీఆర్ ఆహ్వానిస్తారు. అయితే ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన కేసీఆర్.. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచన ప్రాయంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కేసీఆర్ చొరవ తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి జగన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని భావిస్తున్నారు.