టీడీపీ డిప్యూటీ లీడర్లను ఖరారు చేసిన చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: అసెంబ్లీలో టీడీపీ డిప్యూటీ లీడర్లను టీడీపీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉండనుండగా అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, రామానాయుడు ఉపనేతలుగా ఉండనున్నారు. ఇక టీడీపీ విప్ గా వీరాంజనేయస్వామి ఉంటారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా యనమల రామకృష్ణుడు ఉపనేతలుగా డొక్కా మాణిక్యవరప్రసాద్, సంధ్యారాణి, శ్రీనివాసులు, విప్ గా బుద్ధా వెంకన్న ఉండనున్నారు.