ఏపీ సీ ఎం జగన్ తో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు భేటీ

వాస్తవం ప్రతినిధి: అమరావతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇవాళ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు భేటీ కానున్నారు. ఉదయం 10 గంటల సమయంలో జేఏసీ నేతలు సీఎం జగన్‌ను కలవనున్నారు. సమస్యలు, డిమాండ్ల పరిష్కారం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం తదితర అంశాలపై నేతలు సీఎంతో చర్చించనున్నారు. సీఎంను కలిసిన తర్వాత జేఏసీ నేతలు సమ్మెపై ప్రకటన చేయనున్నారు. ఈ నెల 13 నుంచి సమ్మె బాట పట్టనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక జేఏసీ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.