పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ అరెస్ట్

వాస్తవం ప్రతినిధి: మనీ లాండరింగ్‌ కేసులో పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ ని నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో బృందం అదుపులోకి తీసుకుంది. పీపీపీ సహాధ్యక్షుడిగా ఉన్న జర్దారీ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను ఇస్లామాబాద్‌ హైకోర్టు తిరస్కరించిన కొద్ది గంటల్లోనే ఆయన అరెస్టయ్యారు. కోర్టులో ప్రవేశపెట్టే వరకు ఎన్‌ఏబీ కార్యాలయంలోనే ఆయన్ను ఉంచుతారని సమాచారం. ఈ కేసులో జర్దారీతోపాటు ఆయన సోదరి ఫర్యాల్‌ తల్పూర్‌ ప్రధాన నిందితులుగా ఉన్నారు. అధికారంలో ఉండగా అక్రమంగా సంపాదించిన రూ.6.80 కోట్లను విదేశాలకు తరలించేందుకు వేలాది నకిలీ అకౌంట్లను సృష్టించారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.