టీమిండియాకు బిగ్ షాక్..ప్రపంచకప్ సిరీస్ నుంచి శిఖ‌ర్ ధావ‌న్ ఔట్

వాస్తవం ప్రతినిధి: ప్ర‌పంచ‌క‌ప్‌లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న టీమిండియాకు బిగ్ షాక్ త‌గిలింది. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ ఈ టోర్నీనుంచి పూర్తిగా వైదొలిగాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలపై గెలిచి జోరుగా ఉన్న తరుణంలో ఊహించని దెబ్బ పడింది. ఓపెనర్ శిఖర్ ధవన్ సిరీస్ నుంచి అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చింది.

ఆ మ్యాచ్‌లో చేతి బొటనవేలికి గాయమైంది. దీంతో అతడు మొత్తం సిరీస్ నుంచే ఔట్ అయ్యాడు. ధవన్‌కు బదులు కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా బరిలో దిగే అవకాశాలున్నాయి. ధవన్ స్థానంలో అంబటి రాయుడికి అవకాశమిచ్చే చాన్స్ ఉంది. ధావ‌న్ గాయంను ప‌రిశీలించిన వైద్యులు మూడు వారాల రెస్ట్ కావాల‌ని తెలిపారు. ధావన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే సెంచరీతో చెలరేగిన విష‌యం తెలిసిందే. మరో ఎండ్ లో రోహిత్ శర్మ కూడా ఫామ్ లో ఉన్నాడు. దీంతో భారత జట్టు ఓపెనింగ్ జోడీ పటిష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ధావన్ దూరం కావడం జట్టుకి ఎదురుదెబ్బే. మూడు వారాల పాటు ధావన్ విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే.. పూర్తిగా వరల్డ్ కప్ కి దూరం కావాల్సి ఉంటుంది