మెగా హీరో ని డైరెక్ట్ చేయబోతున్న ఎన్టీఆర్ డైరెక్టర్..!

వాస్తవం సినిమా: ఒక పక్క దర్శకుడిగా రాణిస్తూ మరో పక్క నిర్మాతగా కూడా రాణించాలని ప్రయత్నాలు జరుపుతున్నాడు డైరెక్టర్ బాబీ. జూనియర్ ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమా తీసి ఇండస్ట్రీలో తనకంటూ క్రేజ్ మరియు పాపులారిటీ తెచ్చుకున్న బాబీ ప్రస్తుతం వెంకటేష్ నాగచైతన్యతో వెంకీ మామ సినిమాను డైరెక్ట్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఇదే క్రమంలో మరో పక్క అరుణ్ పవర్ అనే యువ దర్శకుడితో ఒక కొత్త సినిమాను నిర్మించాలని బాబీ సిద్దమయ్యాడు. ఆ కథలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా అరుణ్ వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర గోవింద సినిమాను కూడా డైరక్ట్ చేశాడు. దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అరుణ్ కథకు సాయి ధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి. ఇప్పటికే సాయి ధరంతేజ్ వరుస ఫ్లాపులతో ఉన్నాడు..చివరిగా వచ్చిన చిత్రలహరి సినిమా కొద్దో గొప్పో ప్రేక్షకులను అలరించింది. ఇటువంటి క్రమంలో సాయి ధరంతేజ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.