మరో మూడొందల కోట్లు గ్యారెంటీ ?

వాస్తవం సినిమా: బాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క బాహుబలి రికార్డులను మినహా చాలా రికార్డును సృష్టించాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. బాలీవుడ్ ఇండస్ట్రీలో వంద కోట్ల క్లబ్ స్టార్ట్ అయినప్పుడు అత్యధిక 100 కోట్ల సినిమాలను కలెక్ట్ చేసిన హీరోగా సల్మాన్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత 200 కోట్ల క్లబ్ లో కూడా హిస్టరీ క్రియేట్ చేశాడు. అయితే ఎప్పుడైతే రెండు వందల కోట్ల క్లబ్ స్టార్ట్ అయ్యిందో అవలీలగా సల్మాన్ ఖాన్ ఆ మార్కు ఈజీగా దాటేస్తున్నాడు. అలాగే మూడు వందల కోట్ల క్లబ్‌లో కూడా సల్మాన్‌ మొదటిగా అడుగు పెట్టలేదు. కానీ ఇప్పుడు మరో హీరో ఎవరికీ లేనన్ని మూడొందల కోట్ల సినిమాలు అతని ఖాతాలో వున్నాయి. టైగర్‌ జిందా హై, బజరంగి భాయ్‌జాన్‌, సుల్తాన్‌ చిత్రాలతో మూడు వందల కోట్లు సాధించిన సల్మాన్‌ మరోసారి ఆ మార్కు చేరుకోవడం కోసం దూసుకుపోతున్నాడు. భలేగా కలిసి వచ్చిన రంజాన్‌ సీజన్‌లో విడుదల చేసిన అతని తాజా చిత్రం ‘భారత్‌’ తొలి వారాంతంలోనే నూట యాభై కోట్ల నెట్‌ వసూళ్లు సాధించింది. సోమవారం వసూళ్లు కూడా చాలా బాగున్నాయనే రిపోర్ట్స్‌ వస్తున్నాయి. ఒకవైపు షారుక్‌ ఖాన్‌ చిత్రాలకి వంద కోట్ల నెట్‌ రావడం కూడా గగనమైపోతోంటే, అమీర్‌ ఖాన్‌ ‘దబాంగ్‌’ తర్వాత స్లో అయిపోతే సల్మాన్‌ మాత్రం కోట్లు రాబట్టడం తనకి చిటికెలో పని అంత తేలికన్నట్టు హల్‌చల్‌ చేస్తున్నాడు. ఇక ఫుల్ టైమ్ లో సల్మాన్ ఖాన్ ‘భారత్‌’ కలెక్షన్లలో ఈజీగా 300 కోట్లు మార్క్ దాటేయడం గ్యారెంటీ అని బాలీవుడ్ ట్రేడ్ వర్గానికి చెందినవారు కామెంట్స్ చేస్తున్నారు.