అల్లరి నరేశ్ కి మళ్ళీ దెబ్బ ?

వాస్తవం సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీ లో కామెడీ సినిమాలతో రాణించిన అల్లరి నరేష్ గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమౌతున్న సమయంలో ప్రయోగాత్మకంగా మహర్షి సినిమాలో మహేష్ బాబు పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అద్భుతమైన పేరు సంపాదించుకున్నాడు. సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో సినిమా సక్సెస్ సమావేశంలో పాల్గొన్న అల్లరి నరేష్ ఈ సినిమా సక్సెస్ అయ్యిందని చెవిన పడగానే సక్సెస్ మాట విని చాలా సంవత్సరాలు అయిందని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు అల్లరి నరేష్. ఈ సినిమాతో ఇంకా అల్లరి నరేష్ ఇండస్ట్రీలో ఇంకా వెనక్కి తిరిగి చూసుకో అక్కర్లేదు అని అందరూ భావించారు. వరుస అవకాశాలు అల్లరినరేష్ వస్తాయని అందరూ భావించారు. ఈ క్రమంలో రవితేజతో ‘డిస్కో రాజా’ సినిమాలో ఓ పాత్ర పోషిస్తున్నట్లు కూడా ఫిలింనగర్ నుండి వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాలో అల్లరి నరేష్ కి పాత్ర లేదని సమాచారం. గతంలోనే రవితేజతో కలిసి శంభో శివ శంభో సినిమాలో అల్లరి నరేష్ నటించడం జరిగింది. అయితే ఆ సినిమా ప్రేక్షకులను సరిగా ఆచరించకపోవడంతో.. పైగా తాను చేస్తున్న సినిమాలు కూడా వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్న నేపథ్యంలో ఇటువంటి సమయంలో ప్రయోగాలు చేయకూడదని డైరెక్టర్ వీ ఐ ఆనంద్ కి రవితేజ సూచించినట్లు…దీంతో ఈ సినిమాలో అల్లరి నరేష్ నటించడం లేదని ఇండస్ట్రీ లో వినపడుతున్న టాక్. ఏది ఏమైనా అల్లరి నరేష్ కి చేతిదాకా వచ్చిన అవకాశం వచ్చినట్లే వచ్చి పోవడంతో మళ్లీ కెరియర్ కి దెబ్బ మీద దెబ్బ తగిలేటట్లు ఉందని అంటున్నారు కొంతమంది ఇండస్ట్రీకి చెందిన వారు.