టీడీపీ వారి చేత శభాష్ అనిపించుకుంటున్న ఏపీ సీఎం జగన్..!

వాస్తవం ప్రతినిధి: ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకముందు ఢిల్లీలో గెలిచిన తర్వాత మోడీ కి అభినందనలు చెప్పిన సమయం లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఆరునెలల్లోనే ప్రజల చేత మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా నని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రజల తో పాటు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుల చేత కూడా జగన్ మంచి పరిపాలకుడు అని అంటున్నారని తుని వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కామెంట్ చేస్తున్నారు. జగన్ తన తండ్రికి మాదిరే పరిపాలన చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారని జగన్ నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయని స్వయంగా టిడిపి వారే ఈ కామెంట్ చేస్తున్నారని రాజా పేర్కొన్నారు. జగన్ పాలన చూసి ప్రజలు ఆశ్చర్యం చెందుతున్నారని, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను మరిపించేలా చేస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలే జగన్‌ చాలా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారని చెబుతున్నారు. చంద్రబాబులా జగన్‌కు ప్రజలను మోసం చేయడం తెలియదు….రాదు. చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకోవడం కోసమే తన సమయాన్ని వినియోగించుకున్నారు. అదే జగన్ మంచి పాలనపై దృష్టి పెట్టి ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్నారు. ప్రభుత్వ విప్‌గా తనకు బాద్యత ఇచ్చారని దానికి న్యాయం చేస్తానని ఆయన అన్నారు.