కోడెల ఫ్యామిలీ అసలు ఏం చేశారు ? ఎందుకు ఇన్ని ఆరోపణలు ?

వాస్తవం ప్రతినిధి: సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు ఆ నియోజకవర్గంలో చేసిన అవినీతి తాజాగా మెల్లమెల్లగా బయట పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఓడిపోయారు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్. జరిగిన ఎన్నికలలో సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు చాలా దారుణంగా కోడెల శివప్రసాద్ ను ఓడించారు. దానికి కారణం వారి కుటుంబ సభ్యులు చేసిన అవినీతి ఆకృత్యాలు అని ప్రస్తుత పరిస్థితుల బట్టి తెలుస్తున్నాయి. అంతేకాకుండా వారి చేసిన అవినీతి మరియు ఆకృత్యాలు వంటి వాటిపై పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యులు చేసిన ఆకృత్యాల పై వైసీపీ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ”ప్రజలు వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసిన కోడెల కుటుంబ సభ్యులెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరు. ‘కే’ ట్యాక్స్ పేరుతో వందల కోట్లు దోచుకున్నారు. దీనికి సహకరించిన అధికారులు కూడా దోషులే. నిర్బంధ వసూళ్ల మాఫియా అరాచకాలపై దర్యాప్తు జరుగుతుంది. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి” అని ఆయన ట్వీట్ చేశారు. ఆయన మాత్రమే కాదు.. పోలీసులు కూడా బాధితులు బయటకు వస్తే న్యాయం చేస్తామని బహిరంగంగానే ప్రకటించారు. దీంతో కోడెల బాధితులు పోలీస్ స్టేషన్ల కు క్యూ కడుతున్నారని తెలుస్తోంది. తమకు అన్యాయం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారని సమాచారం. అందరి నుంచి లిఖితపూర్వకండా ఫిర్యాదులు తీసుకుంటున్నారట పోలీసులు. ఇంతకీ కోడెల ఫ్యామిలీ చేసిన ఆకృత్యాలు ఏమిటంటే ప్రజల వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేయడం..వ్యాపారుల దగ్గర ”కే ట్యాక్స్” పేరుతో డబ్బులు లాక్కోవడం వంటి వాటివి చేసినట్లు తాజాగా బయటపడుతున్నాయి. తాజాగా వీటన్నిటిపై కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం పై కేసు నమోదైనట్లు సమాచారం.