నా మంత్రులు హీరోలు అంటున్న జగన్..!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్ తన మంత్రివర్గాన్ని కూడా ఏర్పరుచుకున్నారు . తాజాగా ఇటీవల మొట్టమొదటి క్యాబినెట్ సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో మంత్రులకు అధికారులకు ఎట్టి పరిస్థితుల్లో అవినీతి జరగకూడదని హెచ్చరికలు జారీ చేస్తూ ఎవరి మీదనైనా ఆధారాలతో కూడిన అవినీతి ఆరోపణలు వస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం జగన్. మరి అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు మంత్రులకు తెలపకుండా సొంత నిర్ణయాలు చేయవద్దని ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారని సమాచారం. నేను ఏర్పరచుకున్న మంత్రివర్గంలో ఉన్నవారు డమ్మీలు కాదని ఆయన అదికారులకు స్పష్టం చేశారు.వారు హీరోలు అని ఆయన అన్నారు. మంత్రులు, అధికారులు కలిసి పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని కోరారు. అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఈ సందర్భంగా జగన్ మంత్రులకు కూడా సూచించారు. గతంలో ఆయా మంత్రిత్వశాఖల్లో జరిగిన అవినీతిని ప్రజలకు తెలిసేలా వె బ్‌సైట్‌లో పెట్టాలని మంత్రులకు జగన్‌ సలహా ఇచ్చారు.