తెలుగు రాష్ట్రాలపై మోడి సరికొత్త పాచిక ?

వాస్తవం ప్రతినిధి: ఉత్తర భారతదేశంలో బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీ తాజాగా రెండోసారి కేంద్రంలో భారీ స్థాయి మెజార్టీ లో అధికారంలోకి వచ్చాక దక్షిణ భారతదేశంపై బలమైన కన్ను వేసింది. దక్షిణ భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో బలంగానే ఉన్న బిజెపి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో తన జెండా ఎగర వేయాలి అనే కోరికతో ఉన్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తుంది. విషయంలోకి వెళితే రెండు తెలుగు రాష్ట్రాలలో బిజెపి పార్టీని అంతగా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. తెలంగాణలో కొద్దో గొప్పో బిజెపికి ఓటు బ్యాంక్ ఉన్నా కానీ ఆంధ్రా లో మాత్రం బీజేపీని పట్టించుకునే నాధుడే లేడు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలపై పట్టు పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.ఇందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో విదేశాంగ శాఖ మంత్రిగా పని చేసిన బీజేపీ సీనియర్ సుష్మా స్వరాజ్ తాజా ఎన్నికలలో దూరంగా ఉన్నారు. బలమైన నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమెని తెలుగు రాష్ట్రాలకి గవర్నర్ గా పంపించడం ద్వారా ఇక్కడ తమ ఆధిపత్యం చూపించి, ప్రజలని ఆకట్టుకొని బలమైన శక్తిగా మారాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. దీనికి బీజేపీ చీఫ్ అమిత్ షా, ప్రధాని మోడీ పక్కా ప్లాన్ ప్రకారం ఆమెని పోటీకి దూరంగా ఉంచి గవర్నర్ గా పంపించి సౌత్ లో స్ట్రాంగ్ గా పాగా వేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.