లండన్‌లో భారీ అగ్నిప్రమాదం..కోట్ల రూపాయల ఆస్తి నష్టం

వాస్తవం ప్రతినిధి: లండన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. తెలిపారు. అయితే కోట్ల రూపాలయ ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం..ఆదివారం సాయంత్రం స్థానిక డీపాన్ గార్డెన్స్‌ సమీపంలో ఓ రెసిడెన్షియల్ ప్లాట్స్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అన్ని ప్లాట్స్‌కు మంటలు వ్యాపించాయి. అందులో నివాసముంటున్న వారు భయంతో పరుగులు పెట్టారు. మొత్తం ఆరు అంతస్థులు ఉన్న ఈ నివాస సముదాయం మంటలకు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న 100 మంది అగ్నిమాపక సిబ్బంది.. 15 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదపుచేశారు. క్షణక్షణానికి మంటల తీవ్రత పెరగడంతో.. బాధితులను వెంటనే అక్కడి నుంచి దూరంగా తరలించారు.